Posts

బీజేపీ ఆఫీస్‌లో స్వామి వివేకానంద గారి జయంతి

Image
 💐💐💐💐💐💐💐 ❇️ యువతకు స్ఫూర్తి ప్రదాత... తన చైతన్యమయ ప్రసంగాలతో దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన మహనీయుడు... దేశ శక్తి మరియు సృజనాత్మకత యువత చేతుల్లోనే ఉందని ప్రబోధించిన మార్గదర్శి... ❇️ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా... జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా, రేమద్దుల బీజేపీ ఆఫీస్‌లో స్వామి వివేకానంద గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. జై హింద్! 🙏

బీజేపీ, రేమద్దుల పార్టీ ఆఫీస్ లో తెలంగాణ విమోచన దినోత్సవము

Image
 నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది, స్వాతంత్య్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైన రోజు సందర్భంగా, నాడు నిజాం కు వ్యతిరేకంగా   పోరాటం చేసి అసువులు బాసిన అమరులను గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.   #TelanganaLiberationDay      

బోనాల పండుగ శుభాకాంక్షలు

Image
రేమద్దుల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు! పోషమ్మ తల్లి అనుగ్రహంతో మన గ్రామం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. #BonalaPanduga #బోనాలపండుగ

భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం - 15-ఆగస్ట్-2024

Image
 దేశ ప్రజలందరికి 78వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు మరియు అభినందనలు! ఈ సందర్భంగా బీజేపీ, రేమద్దుల కార్యాలయం దగ్గర రేమద్దుల బీజేపీ సభ్యుడు డేగ చక్రవర్తి జాతీయ జెండా ఎగురవేయడం జరిగినది.

బీటీ రోడ్డు వేయాలని వనపర్తి కలెక్టర్ కి బీజేపీ వినతి

Image
రేమద్దుల గ్రామ రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు, గ్రామ ప్రజలు "చలో కలెక్టరేట్" కార్యక్రమంలో భాగంగా రేమద్దుల నుండి వనపర్తి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్ర బీజేపీ మరియు రేమద్దుల శాఖ ఆధ్వర్యంలో జరిగింది.   22 సంవత్సరాల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు త్వరగా గుంతలమయమై, పూర్తిగా దెబ్బతిన్నది. ఆర్టీసి బస్సుల నడక తగ్గడం వలన విద్యార్థులు 3 కి.మీ. నడవాల్సి వస్తోంది, వయోవృద్ధులు మరియు ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రోడ్డు పునర్నిర్మాణం కోసం, త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఈ పాదయాత్రలో వనపర్తి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, సుందర్ రెడ్డి, నందకుమార్, భాష, చక్రవర్తి, రాజవర్ధన్ రెడ్డి, బాలరాజు, పరమేష్, తిరుపతయ్య, శ్యామ్,మౌలాలి, రాము తదితరులు పాల్గొన్నారు.