రేమద్దుల గ్రామ రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు, గ్రామ ప్రజలు "చలో కలెక్టరేట్" కార్యక్రమంలో భాగంగా రేమద్దుల నుండి వనపర్తి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్ర బీజేపీ మరియు రేమద్దుల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. 22 సంవత్సరాల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు త్వరగా గుంతలమయమై, పూర్తిగా దెబ్బతిన్నది. ఆర్టీసి బస్సుల నడక తగ్గడం వలన విద్యార్థులు 3 కి.మీ. నడవాల్సి వస్తోంది, వయోవృద్ధులు మరియు ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రోడ్డు పునర్నిర్మాణం కోసం, త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పాదయాత్రలో వనపర్తి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, సుందర్ రెడ్డి, నందకుమార్, భాష, చక్రవర్తి, రాజవర్ధన్ రెడ్డి, బాలరాజు, పరమేష్, తిరుపతయ్య, శ్యామ్,మౌలాలి, రాము తదితరులు పాల్గొన్నారు.