Posts

Showing posts from June, 2024

జూన్ 26 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్

Image
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని మరియు పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్

చెంచు మహిళ ఈశ్వరమ్మ పై జరిపిన పాశవిక దాడి

Image
 కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో కాంగ్రేస్ కార్యకర్తలు జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన చెంచు మహిళ ఈశ్వరమ్మ ను వారి కుటుంబ సభ్యులను కలిసి, ఈ దాడిని ఖండిస్తూ ఈ రోజు  బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన రేమద్దుల గ్రామ BJP కమిటీ.

డా|| శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బాలిదాన్ దివస్ సందర్భంగా

Image
  స్వాతంత్ర సమర యోధుడు, విద్యావేత, పార్లమెంటేరియన్, జనసంగ్ వ్యవస్థాపకులు డా" శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బాలిదాన్ దివస్ ( వర్ధంతి) సందర్భంగా వారికి ఘన నివాళులు.

రేమద్దుల రోడ్ గురుంచి బీజేపీ కార్యకర్తల సమావేశం.

Image
 బీజేపీ, రేమద్దుల కార్యాలయంలో రేమద్దుల రోడ్ (ఏదుట్ల నుండి రేమద్దుల మరియు రేమద్దుల నుండి సింగాయపల్లి ) గురుంచి బీజేపీ కార్యకర్తల సమావేశం. 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం - రేమద్దుల గ్రామం

Image
 మాన్య శ్రీ నరేంద్ర మోది గారు మూడవ సారి ప్రధాన మంత్రి పదవి  స్వీకరించిన సందర్భంగా రేమద్దుల గ్రామంలో 10-జూన్-2024 ఘనంగా జరుపుకోవడం జరిగినది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్ డి గారు, వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, వనపర్తి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. పానగల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అన్వేష్ గారికి మరియు అక్కడినుండి వచ్చిన బీజేపీ వానర సైన్యానికి ప్రత్యేక ధన్యవాదములు.  విజయోత్సవాలను ఘన విజయం చేసేందుకు రెండు రోజులు కృషి చేసిన రేమద్దుల బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయానికి మీరే కారణం. ప్రవీణ్ కుమార్, సుందర్ రెడ్డి, డేగ చక్రవర్తి రెడ్డి, నందకుమార్, తిరుపతయ్య, నరేందర్ రెడ్డి, భాషా, రవిందర్, రాము, వేణు గోపాల్, సురేందర్ రెడ్డి, మౌలాలి, పరమేష్, శ్యామ్ సుందర్, బాల్ రాజు, వడ్ల రాజు, నాగరాజు, మల్లయ్య,... మీరందరు అద్భుతంగా పని చేసారు. ముందుకు సాగుతూ పదండి, రాబోయే రోజులు మనవే . 

భారతీయ జనతా పార్టీ, రేమద్దుల కార్యాలయం కార్యాలయం ప్రారంభం

Image
 రేమద్దుల గ్రామంలో బీజేపీ పార్టీని బలపర్చడానికి, శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయాలను సాధించే దిశగా, రేమద్దుల గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని 10-మే-2024 రోజున ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభోత్సవం జరిగినది. ముఖ్య అతిధులు : భరత్ ప్రసాద్ పోతుగంటి , నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు , కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి