బీటీ రోడ్డు వేయాలని వనపర్తి కలెక్టర్ కి బీజేపీ వినతి

రేమద్దుల గ్రామ రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు, గ్రామ ప్రజలు "చలో కలెక్టరేట్" కార్యక్రమంలో భాగంగా రేమద్దుల నుండి వనపర్తి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్ర బీజేపీ మరియు రేమద్దుల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. 

 22 సంవత్సరాల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు త్వరగా గుంతలమయమై, పూర్తిగా దెబ్బతిన్నది. ఆర్టీసి బస్సుల నడక తగ్గడం వలన విద్యార్థులు 3 కి.మీ. నడవాల్సి వస్తోంది, వయోవృద్ధులు మరియు ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రోడ్డు పునర్నిర్మాణం కోసం, త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఈ పాదయాత్రలో వనపర్తి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, సుందర్ రెడ్డి, నందకుమార్, భాష, చక్రవర్తి, రాజవర్ధన్ రెడ్డి, బాలరాజు, పరమేష్, తిరుపతయ్య, శ్యామ్,మౌలాలి, రాము తదితరులు పాల్గొన్నారు.



 



































 


Comments

  1. పోరాటం ఒక్కరి సొత్తు కాదని, రేమద్దుల రోడ్ కోసం మీరు చేసిన ప్రయత్నం ఊరికేపోదు పాదయాత్రలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి అభినందనలు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏదుట్ల - రేమద్దుల - సింగాయపల్లి BT రహదారి నిర్మాణానికి మద్దతుగా 1000 రేమద్దుల వాసుల సంతకాలు

భారతీయ జనతా పార్టీ, రేమద్దుల కార్యాలయం కార్యాలయం ప్రారంభం

రేమద్దుల రోడ్ గురుంచి బీజేపీ కార్యకర్తల సమావేశం.